New Fastag Rules : ఆగ‌స్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ వ‌చ్చేశాయి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!


New Fastag Rules : ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పులు చేసింది. ఆగస్టు 01 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వాహనదారులు కొత్త రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఫాస్టాగ్ ఖాతా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. నేషనల్ హైవేలపై ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. ఇది హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద టోల్ పన్నుల చెల్లింపును సులభతరం చేస్తుంది. ఇప్పుడు ఎన్ హెచ్ఏఐ ఫాస్టాగ్ రూల్స్ ను మార్చింది. కొత్త రూల్ ప్రకారం కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన ప్రకారం ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ అకౌంట్లను మార్చాలి.

ఫాస్టాగ్ కేవైసీ పూర్తి చేయడానికి గడువు అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు విధించింది. ఫాస్టాగ్ ఖాతా కేవైసీ ప్రక్రియ ఆగస్టు 1వ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తుంది. మూడు సంవత్సరాల వయస్సు ఉన్న ఫాస్టాగ్ ఖాతాలు వారి కేవైసీని మళ్లీ అప్‌డేట్ చేయాలి. అయితే మీ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ ప్రక్రియ ఆగస్టు 1వ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ అవుతుంది. ఫాస్టాగ్ నిబంధనలలో మరో మార్పు ఏమిటంటే…. మీ ఫాస్టాగ్ ఖాతా మీ వాహనం, వాహన యజమాని ఫోన్ నంబర్‌కు లింక్ చేయాలి. ఏప్రిల్ నుంచి ఒక్క వాహనానికి మాత్రమే ఫాస్టాగ్ ఖాతాను వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌కు ఖాతాను లింక్ చేయడం కూడా అవసరం. ఇందుకోసం వాహనం ముందు, పక్క ఫొటోలను కూడా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

New Fastag Rules came into effect from august 1st 2024 know about them
New Fastag Rules

ఆగస్టు 1న లేదా ఆ తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేసే వారు వాహనం కొనుగోలు చేసిన మూడు నెలల్లోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.. యజమానులు తమ ఫాస్టాగ్‌లను రిజిస్ట్రేషన్‌, ఛాసిస్‌ నంబర్లకు డెడ్‌లైన్‌లోగా లింక్‌ అయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది. కొత్త వాహనాల యాజమానులైతే రిజిస్ట్రేషన్‌ నంబర్లను 90 రోజుల్లోగా అప్‌డేట్‌ చేయాలి. 30 రోజుల గడువులోగా చేయకపోతే బ్లాక్‌లిస్టులో పెడతారు. ఫాస్టాగ్‌ ప్రొవైడర్లకు కూడా ఎన్పీసీఐ అదనంగా పలు రూల్స్‌ తీసుకొచ్చింది. వాహనానికి సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని వెరిఫై చేసి డాటాబేస్‌ను అప్‌డేట్‌ చేయాలి. సులభంగా గుర్తించేలా వాహనం ముందు, పక్కవైపు ఫొటోలను స్పష్టంగా అప్‌లోడ్‌ చేయాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *