Nara Lokesh : ఏపీలో కొన్నాళ్లుగా అధికార, ప్రతిపక్షాల మధ్య ఓ రేంజ్ వార్ నడుస్తుంది.నువ్వా, నేనా అంటూ పోటీలు పడుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు దూకుడు పెంచారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ, అధినేత వైయస్ జగన్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్షలాదిమంది ప్రజలను జల సమాధి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పగ తీర్చుకోవాలని జగన్ ప్రయత్నాలు చేశారని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అనుకుంటే ఎంతకైనా తెగిస్తాడని, ఎంతకైనా ఒడిగడతాడని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు.అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేసి, 5 ఊర్లు నామరూపాలు లేకుండా చేశారని ధ్వజమెత్తారు.
ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజి ఢీకొని కూల్చేసి, విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామ రూపాలు లేకుండా చేయాలని చూశారని అన్నారు. ఇదే ప్లాన్ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజి ఢీకొట్టి కూల్చేయాలని.. విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామ రూపాలు లేకుండా చేసి, లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలైంది. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలనే కుట్ర ప్లాన్ చేసింది జగన్ అయితే, ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్. తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విషప్రచారం చేస్తుంది జగన్ ముఠా.” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ప్రకాశం బ్యారేజ్ గేట్లను సంబంధించి విజయవాడ పోలీసులు ఇప్పటికే రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వైసీపీ నాయకుల ప్రమేయం ఉందా లేదా ? అని దర్యాప్తు చేస్తున్నామని ఇప్పటికే విజయవాడ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి నారా లోకేష్ వైయస్ జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఈ కేసు పూర్వపరాలు ఎప్పుడు బయటకి తెస్తారో చూడాలి.
Source link