Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ,మహేష్ బాబు కలిసి నటించిన సినిమాలు ఏవో తెలుసా..అందులో ఎన్ని హిట్ అంటే..!


Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.తండ్రికి తగ్గ తనయుడిగా సూపర్ స్టార్ హోదాను దక్కించుకున్నారు.చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తన సహజమైన నటనతో ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.అయితే మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా తండ్రితో కలిసి ఏడు సినిమాలలో నటించారు.ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా తండ్రితో కలిసి మూడు సినిమాలలో నటించడం జరిగింది.ఇలా వీరిద్దరూ కలిసి 10 సినిమాలలో కలిసి నటించడం జరిగింది.మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన నీడ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

పోరాటం:కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన పోరాటం సినిమాలో మహేష్ బాబు తన తండ్రి కృష్ణ తో కలిసి నటించడం జరిగింది.బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఘనవిజయం సాధించింది.శంఖారావం:తన తండ్రి కృష్ణ తో కలిసి మహేష్ బాబు రెండో సారి శంఖారావం అనే సినిమాలో నటించారు.కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది.బజారు రౌడీ:మహేష్ బాబు,రమేష్ బాబు హీరోలుగా చేసిన ఈ సినిమాలో కృష్ణ అతిథి పాత్రలో కనిపించడం జరిగింది.ఈ సినిమాలో మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ అభిమాని గా నటించడం విశేషం.ఈ సినిమాకు ఏ కోందండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.ముగ్గురు కొడుకులు:నాలుగో సారి కృష్ణ,మహేష్ బాబు కలిసి ముగ్గురు కొడుకులు అనే సినిమాలో కలిసి నటించారు.కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా నటించడం జరిగింది.

గూఢచారి 117 :కృష్ణ,మహేష్ బాబు కలిసి అయిదవ సారి గూఢచారి 117 సినిమాలో నటించారు.కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ బాబు హీరో తో సమానంగా ఫైట్లు చేసి ప్రేక్షకులను అలరించారు.ఈ సినిమా ఘనవిజయం సాధించింది.కొడుకు దిద్దిన కాపురం:కృష్ణ,మహేష్ బాబు కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేసారు.అన్న తమ్ముడు:కృష్ణ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ,మహేష్ బాబు కలిసి నటించారు.ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.రాజా కుమారుడు:మహేష్ బాబు హీరో గా చేసిన ఈ సినిమాలో కృష్ణ అతిథి పాత్రలో కనిపించడం జరిగింది.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.వంశి:ఈ సినిమాలో కృష్ణ,మహేష్ బాబు కలిసి నటించారు.బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందింది.టక్కరి దొంగ:మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ క్లైమాక్స్ లో కాసేపు కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *