Legend Movie: నందమూరి బాలకృష్ణ,బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటి వరకు సింహ,లెజెండ్,అఖండ సినిమాలు తెరకెక్కాయి.అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయం సాధించాయి.నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాలయ్య కెరీర్ లో ఆల్ టైం సూపర్ హిట్ సినిమాలు అని చెప్పడంలో సందేహం లేదు.
అయితే బి గోపాల్ తర్వాత బాలయ్య( Bala Krishna ) తో వరుస విజయాలను సొంతం చేసుకుంది బోయపాటి అని చెప్పచ్చు.వీరిద్దరి కంబినేషన్లో వచ్చిన లెజెండ్( Legend ) సినిమాలో బాలయ్య తన నటవిశ్వరూపాన్ని చూపించారు.ఇక ఈ సినిమాలో డైలాగ్స్ బాలయ్య నటన ఇప్పటికి కూడా ప్రేక్షకులలో గూస్ బంప్స్ తెప్పిస్తాయి.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో రాధికా ఆప్టే,సోనాల్ చౌహన్ హీరోయిన్ లుగా నటించారు.
ఈ సినిమాలో బాలయ్య తన చెల్లిని చూడడానికి వెళ్లి అక్కడ ఆడపిల్లల గురించి చెప్పే సీన్ ఇప్పటికి ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టేలా చేస్తుంది.ఇక ఈ సినిమాలో మావయ్య అంటూ బాలయ్య ను పిలిచే చిన్నారి ఇప్పటికి ప్రేక్షకులకు బాగా గుర్తుండే ఉంటుంది.ఈ సినిమాలో తన క్యూట్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నారి మరెవరో కాదు ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను ముద్దుల కూతురు జోషిత శ్రీను.అయితే చాల మందికి ఈ విషయం తెలియదు.అయితే ఈ సినిమాలో బేబీ జోషిత మావయ్య అంటూ బాలయ్య ను ముద్దు గా పిలిచే సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Source link