Kane Williamson : అయ్యో .. కేన్ మామ‌కి ఎంత క‌ష్టం వ‌చ్చింది.. ఊత క‌ర్ర‌ల సాయంతో న‌డుస్తున్న క్రికెట‌ర్..


Kane Williamson : కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో గాయపడిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు అతన్ని కొనుగోలు చేయ‌గా, సీజన్ ఓపెనర్‌గా బరిలో దిగిన అతను.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ‌గా, మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై మంచి స్కోరు చేసింది. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92) అద్భుతంగా ఆడుతున్న నేప‌థ్యంలో అతను కొట్టిన ఒక భారీ సిక్సర్‌ను ఆపేందుకు బౌండరీ లైన్ వద్ద ఉన్న కేన్ విలియమ్సన్ గాల్లోకి ఎగిరి బంతిని క్యాచ్ చేశాడు.

అయితే బౌండరీ లైన్ ఆవల ల్యాండ్ అయ్యేప్పుడు కంట్రోల్ కోల్పోయాడు. దీంతో అతని కుడి కాలు బాగా దెబ్బతింది. నొప్పితో విలవిల్లాడిన అతన్ని గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ఫిజియోలు పరిశీలించారు. కుడి మోకాలికి తీవ్ర గాయమైన నేప‌థ్యంలో ఐపీఎల్ తాజా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. భారత్ నుంచి పయనమైన ఈ స్టార్ క్రికెటర్ న్యూజిలాండ్ చేరుకున్నాడు. అక్కడి ఎయిర్ పోర్టులో, చంకల్లో ఊతకర్రలతో, కాలుకు బ్యాండేజిలతో దర్శనమిచ్చాడు. ఊతకర్రలతో నడుస్తూనే మీడియాతో మాట్లాడుతూ ఎయిర్ పోర్టు వెలుపలికి వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. విలియమ్సన్ పరిస్థితి చూసి అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Kane Williamson latest video viral
Kane Williamson

కుడి కాలు కనీసం నేలపై ఆనించలేకపోతున్న అతన్ని కొందరు మీడియా ప్రతినిథులు ప‌ల‌క‌రించ‌గా, ఇప్పుడు అంత నొప్పిగా లేదు అని సమాధానం చెప్పాడు. ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విలియమ్సన్‌కు ఇలా గాయం అవడం కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బ అని చెప్ప‌క త‌ప్ప‌దు. అభిమానులు కూడా విలియమ్సన్‌ను ఇలా చూడలేకపోతున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే కేన్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు ప్రార్ధిస్తున్నారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *