Kalki 2898AD : క‌ల్కి సినిమా హిట్ అయ్యేది దీపిక జాత‌కం వ‌ల్లే అట‌.. ప్ర‌భాస్ జాత‌కం బాగాలేద‌ట‌..!


Kalki 2898AD : పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ బాహుబలితో పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ ప‌లు సినిమాలు చేయ‌గా , అవి పూర్తిగా నిరాశ‌ప‌రిచాయి. చివ‌ర‌గా న‌టించిన స‌లార్ పెద్ద విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు ఆయ‌న చేస్తున్న క‌ల్కి సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే తదితర భారీ తారాగణం ఈ సినిమాలో భాగమైంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో దీన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించారు.

ప్రస్తుతం ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సినిమా గురించి ప్రముఖ జ్యోతిష్యుడు పండిత్ జగన్నాథ్ గురూజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ కల్కి ఊహించినస్థాయిలో హిట్ అవదని, సినిమాకు రావాల్సిన కలెక్షన్లు మాత్రం మినిమంగానే వస్తాయన్నారు. సినిమాకు పెట్టిన బడ్జెట్ మాత్రం తిరిగివస్తుందన్నారు. ప్రభాస్ జాతకంలో రెండు సంవత్సరాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్ర‌భాస్ గ‌త సినిమాలు ఫ్లాప్ కావ‌డానికి కూడా కార‌ణం ప్ర‌భాస్ గ్ర‌హ‌స్థితి అని ఆయ‌న చెప్పారు. అయితే రణ్వీర్ సింగ్ ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’ సినిమా బాక్సాఫీస్ హిట్ అవుతుంది అని అంచనా వేయగా అది 200 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. గ‌తంలో ప‌లు సినిమాల‌కి ఆయ‌న చెప్పిన ప్రిడిక్ష‌న్స్ క‌రెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ప్ర‌భాస్ సినిమా గురించి ఆయ‌న చెప్పింది నిజం అవుతుందా అని అంద‌రు ఆందోళన చెందుతున్నారు.

Kalki 2898AD movie will become success because of deepkia padukone
Kalki 2898AD

అయితే కల్కి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ సక్సెస్ కాకపోవచ్చని తేల్చేసారు.భారీ వసూళ్లు అయితే ఈ సినిమాకి రాకపోవచ్చని పెట్టిన బడ్జెట్ ని మాత్రం రికవర్ చేయగలుగుతుంది అని అతను అంచనా వేశారు. అంతే కాకుండా ఈ సినిమా విషయంలో గ్రహాల స్థితిగతులు సరిగా లేవని ఇంకా ప్రభాస్ మళ్ళీ భారీ హిట్ అందుకోవడానికి ఇంకో రెండేళ్ల సమయం పడుతుంది అని కూడా అంచనా వేశారు. సినిమాని స‌రైన దారిలో న‌డిపించేంది దీపికా గ్ర‌హ‌స్థితి అని, ప్ర‌భాస్ కాదంటూ ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *