Jr NTR : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్ డైలాగ్‌ల‌తో పిచ్చెక్కించిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ఫిదా..


Jr NTR : సిద్దుజొన్నల‌గ‌డ్డ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన మూవీ టిల్లు స్వేర్. ఇటీవ‌ల థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి వంద కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి సంచ‌ల‌న విజ‌యం సాధించిన డీజే టిల్లు స‌క్సెస్ మీట్ సోమ‌వారం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ తో పాటు తివిక్ర‌మ్ శ్రీనివాస్‌, విశ్వ‌క్ సేన్ ముఖ్య అతిథులుగా హ‌జ‌ర‌య్యారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. నేను మిమ్మ‌ల్ని క‌ల‌వ‌క‌ముందుగా అభిమానులకు, మీడియా వారికి న‌మ‌స్కారాలు తెలియ‌జేసి త‌న ప్ర‌సంగాన్ని స్టార్ట్ చేశారు. సిద్దూవి చాలా సినిమాలు చూశాను గానీ ఎప్పుడు వ్య‌క్తిగ‌తంగా క‌ల‌వ‌లేద‌ని , సిద్దు లాంటి వ్య‌క్తులు ఈ ఇండ‌స్ట్రీలో చాలా త‌క్కువ మంది ఉంటార‌ని సినిమా అంటే అత‌నికి అంత పిచ్చి అని అన్నారు.

టామ్ జెర్రీ,హిమాన్ వంటి క్యారెక్ట‌ర్స్ మ‌న జీవితంలో ఎలా మిగిలాయో డీజే టిల్లు కూడా ఆ లిస్టులో చేరింద‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ అన్నారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ సినిమాలోని డైలాగ్స్ చెప్పారు. ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ తీసుకు వచ్చేటప్పుడు మేకర్స్ చాలా భయం ఉంటుంది. ఎందుకంటే ఆ సీక్వెల్ మొదటి సినిమాని మెప్పించకపోతే ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ విషయం గురించే ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “కల కనడానికి ఒక ధైర్యం ఉండాలి. అయితే ఆ కలని నిజం చేసుకోవడానికి భయం ఉండాలి” అని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముందు చెప్పుకొచ్చారు.

Jr NTR told prabhas and pawan kalyan movie dialogues
Jr NTR

దానికి త్రివిక్రమ్ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ.. “కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి. అంతేగాని నేను ఇక్కడ ఉన్నానని గుర్తించండి. ఐయామ్ టెల్లింగ్ దట్. పోలె అదిరిపోలే” అంటూ అత్తారింటికి దారేది, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని డైలాగ్స్ ని మీమ్ లాంగ్వేజ్ లో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ కి స్టేజి పైన ఉన్న సెలబ్రిటీస్, కింద ఉన్న అభిమానులు పడిపడి నవ్వుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *