Jr NTR : సెప్టెంబర్ 30, 2022న కన్నడలో రిలీజ్ అయిన కాంతారా మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో రిషబ్ శెట్టి హీరోగా నటించడమే కాదు, స్వయంగా ఆయనే సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ క్రమంలోనే కొద్ది నెలల్లోనే పలు ఇతర భాషల్లోకి కూడా ఈ మూవీని డబ్బింగ్ చేశారు. దీంతో ఇతర భాషల్లో కూడా భారీ ఎత్తున హిట్ అయింది. తెలుగులో కాంతారా మూవీకి ఫ్యాన్స్ ఏర్పడిపోయారు. అంతలా ఈ మూవీ భారీ హిట్ అయింది. ఇక ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్నా.. అందులోనూ ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు.
అయితే త్వరలోనే కాంతారా 2 తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది. కాగా అందులో రిషబ్ శెట్టికి తోడుగా జూనియర్ ఎన్‌టీఆర్ కూడా నటిస్తారని అంటున్నారు. ఇటీవలే రిషబ్ శెట్టి, జూనియర్ ఎన్‌టీఆర్ ఇద్దరూ ఒకే చోట కనిపించడం ఈ ఊహాగానాలకు తెరతీసిందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఎన్‌టీఆర్ తీరిక లేకుండా ఉంటారు. ఆయన నటిస్తున్న దేవర సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పాటలకు ఆడియన్స్ నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.
ఇక దేవరతోపాటు ఎన్‌టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ఒక మూవీ చేయనున్నారు. అలాగే హిందీలో వార్ అనే మూవీ రెండు పార్టుల్లోనూ తారక్ నటించనున్నారు. ఇలా వరుస సినిమాలతో తారక్ బిజీగా ఉన్నారు. కాగా ఆయన ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్నారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఆయన కాంతారా 2లో నటిస్తారా, లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
Source link