Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. దఢఖ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పటికే ‘దేవరస సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఈ మూవీ సెట్‌లో ఉండగానే మరో పాన్ ఇండియా మూవీ ఆఫర్ కొట్టేసింది. ఇప్పుడు రామ్ చరణ్ ‘ఆర్‌సీ 16’లో చాన్స్ కొట్టేసింది. నిన్నే ఈ మూవీ ప్రారంభోత్సవంగా గ్రాండ్‌గా జరిగింది. ఈ మూవీ ప్రారంభానికి ముందు జాన్వీ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకుంది.ఆమెతో పాటు సీనియర్ నటి మహేశ్వరి, జాన్వీ కపూర్ బాయ్‌ఫ్రెండ్‌తో పాటు బీ-టౌన్ సెన్సేషన్, సెలబ్రిటీ స్టైలిస్ట్ ఓరీ కూడా దేవస్థానాన్ని సందర్శించాడు.
ఈ సందర్భంగా వ్లాగ్ చేసిన అతడు ఈ వీడియోని తన యూట్యూబ్ చానల్‌లో షేర్ చేశాడు. ఇందులో జాన్వీ కపూర్ కాలినడకన తిరుమల కొండ ఎక్కి మొక్కులు చెల్లించుకుంది. ఈ సందర్భంగా ఆమె మోకాళ్లపై మెట్లు ఎక్కింది . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శ్రీవారి దర్శనంలో భాగంగా వీరు తిరుపతి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్న జాన్వీ కపూర్ మోకాళ్ల పర్వతం మోకాళ్లపై మెట్లెక్కింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. . శ్రీవారి దర్శనంలో భాగంగా వీరు తిరుపతి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఈ క్రమంలో మోకాళ్ల పర్వతం వద్ద జాన్వీ కపూర్, శిఖర్ మోకాళ్లపై మెట్లెక్కారు.
తిరుమల కొండని నడక దారిలో ఎక్కిన జాన్వీ దారిలో తోటి ప్రయాణికులైన ఆడియన్స్ కి జాన్వీ సెల్ఫీలు ఇస్తూనే ముందుకు సాగారు. ఇక శ్రీవారి మెట్లు ఎక్కడానికి మొత్తం అందరూ చాలా కష్టపడినట్లు కనిపిస్తుంది. ఇక దారి మద్యలో ఉన్న స్నాక్స్ ని కూడా తింటూ ముందుకు సాగారు. ఈక్రమంలోనే జాన్వీ మావిడికాయని తింటుంటే.. ఆమె ప్రియుడు శిఖర్ పహారియా జాన్వీ నుంచి ఆ కాయని లాకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నిజంగా జాన్వీ కపూర్‌కి సంబంధించిన విజువల్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇక జాన్వీ తెలుగలో రెండు సినిమాలు చేస్తుండగా, అందులో ఒక్కటి హిట్ అయిన ఈ భామ క్రేజ్ మాములుగా ఉండదు.
Source link