Ileana D’Cruz: ఎంతో క్యూట్ గా ఉన్న కూతురి ఫోటోను షేర్ చేసిన ఇలియానా..ఫొటోస్ వైరల్


Ileana D’Cruz

Ileana D’Cruz: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో రామ్ పోతినేని కు జోడిగా హీరోయిన్ గా పరిచయం అయినా ముద్దుగుమ్మ ఇలియానా.మొదటి సినిమాతోనే తన నటనతో తన అందంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.దేవదాసు హిట్ తర్వాత ఇలియానా సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడిగా పోకిరి సినిమాలో నటించి మరొక బ్లాక్ బస్టర్ అందుకుంది.అలా ఇలియానా తెలుగు లో స్టార్ హీరోలకు జోడిగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఇలియానా ఎన్టీఆర్ తో రాఖి,శక్తి,అల్లు అర్జున్ తో జులాయి,పవన్ కళ్యాణ్ తో జల్సా సినిమాలలో నటించి సూపర్ హిట్ అందుకుంది.ఇక ఈమె తెలుగులో రవి తేజ తో చాల సినిమాలలో నటించింది.తెలుగుతో పాటు ఇలియానా తమిళ్ లో నటించి అక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.ఇక ఈమె తన అదృష్టాన్ని బాలీవుడ్ లో కూడా పరీక్షించుకుంది.

కానీ అక్కడ మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది ఇలియానా.తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే ఈమె స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.అయితే కెరీర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలోనే ఇలియానా బాలీవుడ్ లో వెళ్లిపోవడంతో ఈమెకు తెలుగు లో అవకాశాలు తగ్గి పోయాయి అని చెప్పచ్చు.ఇక చాల కాలం తర్వాత ఇలియానా రవి తేజ తో తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాలో నటించింది.కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పొందింది.దాంతో ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరం గా ఉంటుంది.

అయితే ఇలియానా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు దగ్గరగా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటూ ఉంటుంది.పెళ్లి కాకుండానే తల్లి అయినా ఇలియానా ఇటీవలే తానూ ప్రేగ్నన్ట్ అనే విషయాన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.సోషల్ మీడియా ఖత ద్వారా ఇలియానా గర్భం తో ఉన్న ఫోటోలను కూడా పంచుకునేది.ఇటీవలే ఇలియానా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.తాజాగా ఇలియానా తన కూతురు ఫోటోను పంచుకుంది.సోషల్ మీడియా వేదికగా ఇలియానా తన బిడ్డను పరిచయం చేసింది.ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఎంతో క్యూట్ గా ఉన్న ఇలియానా కూతురి ఫోటో నెట్టింట్లో అందరిని ఆకట్టుకుంటుంది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *