Extra Ordinary Man OTT: లేటెస్ట్ గా నితిన్,శ్రీలీల హీరో హీరోయిన్లు గా నటించిన సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.ఈ సినిమా డిసెంబర్ 8 న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.వక్కంతం వంశి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక ముఖ్య పాత్రలో నటించారు.హరీష్ జైరాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకు మంచి బజ్ ను తెచ్చిపెట్టింది.
ఈ సినిమా రిలీజ్ కు ముందు విడుదల అయినా టీజర్,పాటలు అన్ని కూడా ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు క్రియేట్ చేసాయి.కానీ థియేటర్లలో రిలీజ్ అయినా తర్వాత మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
కామెరిసిల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం రాణించలేకపోయింది అని చెప్పచ్చు.అయితే నితిన్,శ్రీలీల జోడికి మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.థియేటర్లలో ప్రేక్షుకులను ఆకట్టుకోలేకపోయిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా త్వరలోనే ఓటిటీ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్ సొంతం చేసుకుంది.ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా సంక్రాంతి ఫస్ట్ వీక్ లో నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.దీని గురించి ఇంకా సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Source link