CM Chandra Babu : కొత్త ప్ర‌భుత్వం ఎఫెక్ట్‌.. ఆ విధంగా రూ.300 కోట్లు సేవ్ చేయ‌నున్నారా..?


CM Chandra Babu : ఏపీలో ఏర్ప‌డిన బీజేపీ-జ‌న‌సేన-టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌క్షాళ‌న చేస్తుంది. ముందుగా వైసీపీ ఆఫీసులు కూల్చివేస్తూ వారి గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తుంది. ఇక వైసీపీ ప్రభుత్వం చాలా డబ్బులు వృధా చేసిందని టీడీపీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. అన‌వ‌స‌రంగా గెస్ట్ హౌజ్‌లు నిర్మించ‌డం, అన‌వ‌స‌ర‌మైన చోట్ల కూడా వేల కోట్లు త‌గ‌లేసార‌ని కొంద‌రు మండిప‌డుతున్నారు. అయితే అప్ప‌ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వాలంటీర్లకు న్యూస్ పేపర్ అలవెన్స్ కిందట కొంత డబ్బును నెలనెలా జారీ చేసిందని ప్రచారాలు జ‌రిగాయి. అయితే ఇప్పుడు నెల వారీ భత్యం వల్ల ఏపీ ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుందో గణాంకాలతో సహా టీడీపీ వెల్లడించింది.

ప్రస్తుతం ఈ నష్టానికి సంబంధించిన వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. గత వైసిపి ప్రభుత్వం సాక్షి వార్తాపత్రికను కొనుగోలు చేయడానికి 2.6 లక్షల మంది వాలంటీర్లకు నెలకు రూ.200 ఇచ్చింది. ఇది సాక్షికి అందించే సాధారణ ప్రకటనల నుంచి వేరుగా ఉంది. ఈ భత్యం సాక్షి సర్క్యులేషన్‌కు దోహదపడింది. అంటే అంత మంది పాఠకులు వారికి లభించినట్లు అయింది. అయితే, ఇప్పుడు టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి అధికారంలో ఉన్నందున, ఈ “సాక్షి” భత్యాన్ని నిలిపివేస్తూ కొత్త ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో, ఈ పథకం కోసం ప్రభుత్వం మంత్లీ రూ.5.3 కోట్లు లేదా సంవత్సరానికి సుమారు రూ.60 కోట్లు ఖర్చు చేసింది. ఈ భృతిని నిలిపివేయడం ద్వారా ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.300 కోట్లు ఆదా చేస్తుంది, ఈ మొత్తం సాక్షి జేబుల్లోకి వెళ్లకుండా చేస్తుంది.

CM Chandra Babu might stop ads to sakshi to save rs 300 crore
CM Chandra Babu

ఆ రూ.300 కోట్లు మిగుల్చుకొని రాష్ట్ర ప్రజలకి ఏదో ఒక మంచి చేసే అవకాశం ఉందని అంటున్న‌రు. ఇంకా వైసీపీ ప్రభుత్వం స్వలాభం కోసం ఇలాంటి ఎన్నో వృధా ఖర్చులు పెట్టుకొని ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిందని కొంద‌రు టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల‌లో ఒక్కొక్క‌టి వెలుగులోకి తీసుకొచ్చి వారి అక్ర‌మాలు బ‌య‌ట‌పెట్ట‌బోతున్నార‌ని అంటున్నారు. గ‌తంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ అర్హత లేని వారికి ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చే అధికారాన్ని దుర్వినియోగం చేశారని ప్ర‌చారం జ‌రిగింది. ఇక జగన్ సొంత పత్రిక కోసం ప్రజా సొమ్మును వాడుకున్నారని వార్త‌లు వ‌స్తుండ‌గా, దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *