CM Chandra Babu : చేసిన పాపాలు పోవాలంటే జ‌గన్ అక్క‌డ ఉండాలి.. సీఎం చంద్ర‌బాబు..


CM Chandra Babu : వ‌ర‌ద‌లు మిగిల్చిన క‌న్నీటిని తుడ్చేందుకు చంద్రబాబు ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తనతో సహా మంత్రులు, అధికారులు అంతా బురదలోనే తిరుగుతున్నారని చెప్పారు. బుడమేరకు గండ్లు పడినా గత పాలకులు పూడ్చకుండా పట్టించుకోని ఫలితమే ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చాయని ధ్వజమెత్తారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు కబేళా సెంటర్లో బాధితులతో మాట్లాడారు. బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారని విమర్శించారు. బుడమేరకు గండ్లు పడినా గత పాలకులు పూడ్చకుండా పట్టించుకోని ఫలితమే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయని చంద్రబాబు వాపోయారు.

బుడమేరు ప్రాంతాన్ని కబ్జా చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. 9 రోజులుగా మీరు పడిన బాధలు వర్ణనాతీతం అని ఆవేదన వ్యక్తం చేశారు.”ప్రభుత్వానికి ఎన్నో కష్టాలు ఉన్నాయి. పదిన్నర లక్షల కోట్ల అప్పు చేసి దిగిపోయాడు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లు వెనుకా కుట్ర ఉంది. వచ్చి ఈ బురదలో తిరిగి ఉంటే చేసిన పాపాలు కొంతైనా పోయేవి. కానీ బెంగుళూరులో కూర్చుని మాపై బురద చల్లుతున్నాడు. ఇంత పెద్ద మహా యజ్ఞంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నాం. వరదల్లో నష్టపోయిన వారిని అన్ని విధాల ఆదుకోవటంతో పాటు ఆదాయం వచ్చే మార్గాలు కల్పిస్తా. ఉపాధి కోల్పోయిన వారికి ఇంట్లో ఉండే ఆదాయం సమకూర్చుకునేలా చేస్తా’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

CM Chandra Babu said ys jagan must be in ap for his sins
CM Chandra Babu

ఎన్నికల ముందు గులకరాయి డ్రామా ఆడిన జగన్, సింగ్ నగర్​లోని అమాయకుల్ని జైల్లో పెట్టించాడని సీఎం మండిపడ్డారు. ఎన్నికల తర్వాత మళ్లీ బురద రాజకీయాలు చేసేందుకే జగన్ సింగ్ నగర్ వచ్చాడని ఆరోపించారు. ప్రజల్ని కాపాడి ఆదుకోవటమే ఏకైక ధ్యేయంగా తామ పని చేస్తున్నామని సీఎం సష్టం చేశారు. వరద ముంపు వల్ల సింగ్ నగర్ ప్రజల బాధలు వర్ణతాతీతమని అన్నారు. తమ మంత్రి నిద్రాహారాలు మాని బుడమేరు గండ్లు పూడ్చితే మరో మంత్రి నారాయణ సింగ్ నగర్ కష్టాలు తీర్చటమే లక్ష్యంగా రాత్రి పగలు కృషి చేశారన్నారు. దుర్మార్గుడి పాలనలో బుడమేరుకు జరిగిన అక్రమాల వల్లే ఇన్ని కష్టాలని ఆరోపించారు. సర్వసం కోల్పోయిన వారికి రేపు ఒక జత దుస్తులు అందిస్తామని చంద్రబాబు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *