Chiranjeevi : ఎయిర్ పోర్ట్ సిబ్బందిని ప‌క్క‌కి నెట్టేసిన చిరంజీవి.. మండిప‌డుతున్న నెటిజ‌న్స్..


Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి వివాదాల‌కి పోరు. ఆయ‌న ఎప్పుడు సౌమ్యంగా ఉంటారు. అయితే స్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మార‌గా, ఇది చూసి తిట్టిపోస్తున్నారు. చిరంజీవితో సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ అభిమానిని , ఆయన పక్కకు నెట్టేసిన వీడియో నెట్టింట్ సంచలనంగా మారింది. చిరంజీవి ఫ్యామిలీతో కలిసి పారిస్‌కు వెళ్లారు. కొడుకు రామ్ చరణ్ కూడా ఈ విదేశి పర్యటనకు వెళ్లారు. మెగా ఫ్యామిలీ పారిస్‌ టూర్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అయితే చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా, విమానాశ్రయ సిబ్బంది కొందరు ఆయనతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.

ఈ ఘటన పై కొందరు చిరంజీవిని విమర్శిస్తూ కామెంట్లు చేయగా.. మరికొందరు ఆయనను సమర్దించారు. చాలా దూరం ప్రయాణించి.. తన కుటుంబంతో కలిసి ఉన్న వ్యక్తిని అలా చేయడం తప్పు కదా, అతనితో పాటు ఉన్న గ్రౌండ్ స్టాఫ్ కూడా అతన్ని పక్కకు తప్పుకోమని అడిగారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి పారిస్ ఒలింపిక్స్ వేడుకల కోసం కుటుంబంతో కలిసి ఇటీవలే పారిస్ వెళ్లారు. ఇది ఇలా ఉంటే ఇటీవలే టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇలాంటి ఘటనే ఎదురైంది. నాగార్జునతోఫొటో దిగేందుకు వచ్చిన ఓ అభిమానిని ఆయన బాడీ గార్డ్ నెట్టేయడంతో నాగార్జున విమర్శలను ఎదుర్కొన్నాడు. ఆ తరువాత తన బాడీ గార్డ్ చేసిన పొరపాటుకు నాగార్జున ఆ అభిమానికి క్షమాపణలు చెప్పారు.

netizen angry on Chiranjeevi for showing disrespect to fan
Chiranjeevi

“సెలబ్రెటీ ఎవరైనా ఒక్కటే. ఆఫ్ కెమెరాలో అది చిరంజీవి అయినా ఇంకెవరైనా.. ముందు వాళ్ళని అంత ఎత్తులో చూడడం మానేయాలి. నీ కంటే హీరో ఎవరు ఉండరు అనే ఆత్మాభిమానం ఉండాలి” అని ఓ నెటిజన్ ఈ వీడియోపై కామెంట్ పెట్టారు.గతంలో రామ్ చరణ్ సైతం ఇదే మాదిరిగా అభిమానిపై దురుసుగా ప్రవర్తించారు. పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ కూడా దురుసుగా ప్ర‌వ‌ర్తించారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాల విష‌యానికి వ‌స్తే విశ్వంభ‌ర సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *