Chandra Babu : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విష‌యంలో అడ్డంగా బుక్కైన చంద్ర‌బాబు..!


Chandra Babu : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం వేడెక్కుతుంది. ప్రతిపక్షాలకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రధాన ఆస్త్రంగా మారింది. కూటమి పార్టీలు ఈ చట్టంతో మీ భూములను ప్రభుత్వం లాగేసుకుందని ప్రచారం చేస్తున్నారు. ఈ చట్టంపై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా చేస్తుంది. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తుంది. సీఎం జగన్ దీనిపై స్పష్టత సైతం ఇచ్చారు. తాజాగా ఈ అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

“వైసీపీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేస్తారు, దీంతో మీ ఆస్తులు జగన్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు జిరాక్స్ పత్రాలు మాత్రమే ఇస్తారు. ఇది జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. జగన్ ) ఓ ల్యాండ్ గ్రాబర్” అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా…వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ లక్ష్యంగా ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఈసీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Chandra Babu landed in trouble after talking about land titles
Chandra Babu

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ 2023ని ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీనిపై ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఈమధ్యే ఆదేశాలు ఇచ్చారు. స్థిరాస్తులు కొన్నవారికి ఒరిజినల్ డాక్యుమెంట్లకు బదులు జిరాక్స్ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలున్నాయి. అందుకే ఈ చట్టంపై వివాదం మొదలైంది. ఈ చట్టం కారణంగా.. తమ భూముల విషయంలో అధికారులు ఏవైనా తప్పులు చేస్తే, బాధితులు కోర్టులకు కాకుండా.. అధికారుల దగ్గరకే వెళ్లాల్సి ఉంటుందని కొందరు లాయర్లు చెబుతున్నారు.వైసీపీ లీడ‌ర్ మున్నేర్ మాట్లాడుతూ.. కేంద్రం ప్ర‌తీది త‌మ చేతుల్లో పెట్టుకోవాల‌ని చూస్తుంది. కొన్ని చోట్ల రాచ‌రికం ఉంది. అయితే ఈ విష‌యంలో వైసీపీ డ్యామేజ్ జరిగిందా అంటే మూడు సంవ‌త్స‌రాల పాల‌న‌లో అనేక ప‌నులు చేశారు. నాడు నేడు వంటి అనేక‌ప‌నులు చేస్తూ కార్య‌క్ర‌మాలు చేశారు. ఇవ‌న్నీ కూడా ప్ర‌తిప‌క్షాలు చెబుతున్న కొన్ని అబ‌ద్ధాలు అని మున్నేరు. ఆయ‌న ప‌క్కా అవ‌కాశ‌వాది అని చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *