Chandra Babu : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్ ద్వారా 52 రోజుల తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన చంద్రబాబు ఆసుపత్రులు తిరుగుతూ బిజీగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఆయనకు బెయిల్ రాగా, ఇప్పుడు తన అనారోగ్యంకి సంబంధించి చికిత్స తీసుకుంటున్నాడు. క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న ఆయన గతంలో ఓ కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. తాజాగా రెండో కంటికి చేయించుకున్నారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ కు సంబంధించిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. శస్త్రచికిత్స పూర్తయ్యాక చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తుండడం ఆ ఫొటోలో చూడొచ్చు. కాగా, ఆపరేషన్ పూర్తయ్యాక చంద్రబాబు తన నివాసానికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌ను ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయి నవంబర్ 8న రిజర్వ్ కాబడింది. మరోవైపు బెయిల్ పిటీషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించగా ఏపీ హైకోర్టు నవంబర్ 28కు వాయిదా వేసింది. ఈలోగా ఆరోగ్య కారణాలతో ముఖ్యంగా కుడి కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ పెండింగు ఉందని చెబుతూ మద్యంతర బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు కంటి ఆపరేషన్ నిమిత్తం నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది. తిరిగి నవంబర్ 28న జైలులో లొంగిపోవల్సి ఉంది.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అంతేకాకుండా చర్మ ఎలర్జీకు సంబంధించిన వైద్యం కూడా తీసుకున్నారు. నవంబర్ 2న ఏఐజీ ఆసుపత్రిలో చేరి ఒక రోజంతా అక్కడే ఉండి వివిధ పరీక్షలు చేయించుకున్నారు. ఆ తరువాత గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాల వైద్యులు పరీక్షలు చేశారు. బ్లడ్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, 2డీ ఈకో, అలర్జీ స్క్రీనింగ్, ఈసీజీ, లివర్, కిడ్నీ ఫంక్షనింగ్ పరీక్షలు పూర్తి చేశారు. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు ఆయనకు చర్మ ఎలర్జీ సంభవించింది.
Source link