Bhanu Sree Mehra : మ‌ళ్లీ వివాదాస్ప‌ద కామెంట్స్ చేసిన అల్లు అర్జున్ హీరోయిన్‌.. ఇంత‌కీ ఏమ‌న్న‌దంటే..?


Bhanu Sree Mehra : ‘వరుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ భానుశ్రీ మెహ్రా..అందం అభిన‌యం ఉన్న‌ప్ప‌టికీ ఈ అమ్మ‌డు పెద్ద‌గా రాణించ‌లేక‌పోయింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ భాషలో కూడా మూవీస్ చేసింది. సినీ కెరీర్ స‌జావుగా సాగ‌ని క్ర‌మంలో ఈ అమ్మ‌డు ప్రేమించిన వ్యక్తిని 2018లో పెళ్లి చేసుకుంది. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అలానే యూట్యూబ్‌లో ప‌లు ఇంట్రెస్టింగ్ వీడియోలు చేస్తూ సంద‌డి చేస్తుంది. చాలా రోజులుగా సైలెంట్ అయినా ఈ భామ ఇటీవల తనను అల్లు అర్జున్ బ్లాక్ చేశాడంటూ వార్తల్లోకెక్కింది.

ఇక తాజాగా సినీ పరిశ్రమలో ఉన్న ప్రధాన సమస్య ఒక‌టి ఉంద‌ని, దానికి ముగింపు ప‌లకాలంటూ ట్వీట్ల వ‌ర్షం కురిపించింది. సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉన్న అతి ప్రధాన సమస్య వయసు మాత్రమే. వయసు వచ్చినా స్త్రీలను.. పెళ్లైన మహిళలను కేవలం తల్లి, సోదరి, వదినా పాత్రలకే ఎందుకు పరిమితం చేస్తారు. పురుషులకు వచ్చేసరికి మాత్రం అవేమి ప‌ట్టింపులు ఉండ‌వు. తమకంటే చిన్నవారికి ప్రేమికుడిగా కనిపిస్తారు. స్త్రీ విలువను వయసు లేదా ఆమె వైవాహిక స్థితి ఆధారంగా చేసుకుని ఎలా నిర్ణయిస్తారు ?. పాత పద్దతుల‌కి ఇప్ప‌టికైన స్వ‌స్తి ప‌ల‌కండి. అన్ని వయసుల మహిళలను పరిశ్రమ పోత్సహించాల్సిన సమయం ఇది అంటూ తెలియ‌జేసింది భానుశ్రీ.

Bhanu Sree Mehra again controversial comments
Bhanu Sree Mehra

2010లో వరుడు మూవీతో భానుశ్రీ హీరోయిన్ అయ్యారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన వరుడు డిజాస్టర్ కాగా, ఆ దెబ్బతో భానుశ్రీని పట్టించుకున్న నాథుడు లేడు. నిజానికి ఈ హీరోయిన్ మీద విపరీతమైన చర్చ జరిగింది. విడుదల వరకు పోస్టర్స్ లో భానుశ్రీని ఎక్క‌డ‌ రివీల్ చేయలేదు. ఆది సినిమాకు మంచి ప్రచారం దక్కించింది. సినిమా మాత్రం తేడా కొట్టింది. అడపాదడపా సినిమాలు చేస్తూ ఆమె కెరీర్ నెట్టుకొస్తున్నారు. చాలా రోజుల త‌ర్వాత అల్లు అర్జున్ త‌న‌ని బ్లాక్ చేశాడంటూ ఈ అమ్మ‌డు వార్త‌ల‌లోకి ఎక్కింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *