Bala Krishna: దివంగత నటుడు మరియు మహా నాయకుడు అయినా నందమూరి తారకరామారావు కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ.తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.తన నటనతో ప్రేక్షకులను అలరించి క్రేజ్ ను ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు బాలకృష్ణ.
తాతమ్మ కల అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఆ తర్వాత రామ్ రహీమ్,రౌడీ రాముడు కొంటె కృష్ణుడు వంటి సినిమాలలో నటించినప్పటికీ మంగమ్మ గారి మనవడు సినిమా బాలయ్య కు బ్రేక్ ఇచ్చిందని చెప్పచ్చు.కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
లారీ డ్రైవర్,రౌడీ ఇన్స్పెక్టర్,బొబ్బిలి సింహం వంటి మాస్ సినిమాలతో పాటు భైరవ దీపం వంటి పౌరాణిక సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు.సమరసింహా రెడ్డి,నరసింహ నాయుడు,చెన్నకేశవ రెడ్డి వంటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు కూడా బాలకృష్ణ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి.
దర్శకుడు ఏమి చెప్తే అది బాలయ్య గుడ్డిగా చేసేస్తారు అని చాల మంది చెప్తుంటారు.అలా బాలయ్య చేస్తారు కాబట్టే ఆయన నుంచి ఎన్నో వైవిధ్యమైన సూపర్ హిట్ సినిమాలు వచ్చాయని చెప్పడంలో సందేహం లేదు.బసవతారకం కాన్సర్ హాస్పిటల్ నుంచి చాల మందికి వైద్యం అందించి ఎన్నో ప్రాణాలను కాపాడారు బాలయ్య.ఇక బాలయ్య కు సంబంధించిన కొన్ని రేర్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీకోసం..
Source link