Anita Hassanandani : ఉదయ్ కిరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన నువ్వు నేను సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక మంది సినీ తరాలు ఇలా వచ్చి ఆలా వెళ్లిపోతూ ఉంటారు. తెలుగు సినీ ప్రపంచంలో ఇలా వచ్చి వెళ్లే వాళ్లు ఎక్కువే. కెరీర్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు… సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీ విడి వెళ్ళిపోయిన వాళ్లు ఉన్నారు. 1999లో టాలీవుడ్, బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనిత… 2001లో ఉదయ్ కిరణ్ తో నటించిన నువ్వు నేను సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నారు. అప్పట్లో బిగ్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో అనిత నటనకు మంచి మార్కులు ఇచ్చారు ప్రేక్షకులు. నువ్వు నేను సినిమా అనంతరం అనేక తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో అనిత నటించారు.
తరువాత కొన్ని ఐటెం సాంగులతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అటు తరువాత అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చారు.2011లో నుంచి పూర్తిగా సినిమాలకు దూరం అయ్యి వచ్చిన క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు. పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైంది అనిత. చివరగా తెలుగులో 2016లో మనలో ఒకడు సినిమాలో నటించింది అనిత. ఇప్పుడు మళ్ళీ ఎనిమిదేళ్ల తర్వాత సుహాస్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే నువ్వు నేను సినిమా రీ రిలీజ్ చేయడం గమనార్హం. నువ్వు నేను సినిమాతో తెలుగులో మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అనిత ఆ తర్వాత శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను, రగడ.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది.
ఇదిలా ఉంటే సుహాస్ 8వ సినిమా రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకు ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో హీరోయిన్ గా తమిళ్ సూపర్ హిట్ సినిమా జోయ్ హీరోయిన్ మాళవిక మనోజ్ నటిస్తుంది. ఈ సినిమా కొత్త దర్శకుడు రామ్ గోడల దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాతో ‘నువ్వు నేను’ హీరోయిన్ అనిత హాసనందిని తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో అనిత ప్రెస్ మీట్‌లో కూడా పాల్గొంది. చాలా క్యూట్‌క్యూట్‌గా కనిపిస్తూనే తన మాటలతో ఎంతగానో అలరించింది. ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తప్పక చేస్తానని కూడా చెప్పింది.
Source link