Anasuya: అనసూయ గురించి అందరికి తెలిసిందే.ఈమె వృత్తి పరంగా యెంత బిజీగా ఉన్న కూడా తన కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తూ ఉంటుంది.సమయం దొరికినప్పుడు తన కుటుంబం తో ఎంజాయ్ చేసే సెలెబ్రెటీలలో అనసూయ కూడా ఒకరు అని చెప్పచ్చు.అనసూయ తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన భర్త,ఇద్దరు పిల్లలతో వెకేషన్ లకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే అనసూయ తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన ఎన్నో ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.అనసూయ ప్రసుతం కాలిఫోర్నియా లో తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.
ఈ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను అనసూయ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.అనసూయ తన ఫ్యామిలీతో కలిసి కాలిఫోర్నియా ట్రిప్ లో ఎంజాయ్ చేసిన లేటెస్ట్ ఫోటోలు తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అనసూయ తన భర్త తో కలిసి రొమాంటిక్ గా కాలిఫోర్నియా లోని గోల్డెన్ గేట్ దగ్గర ఫోటోలకు ఫోజులిచ్చింది.వైరల్ అవుతున్న ఈ ఫోటోలను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
అనసూయ ఎప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతిదీ అభిమానులతో పంచుకుంటూ టచ్ లో ఉంటుంది.తన లేటెస్ట్ ఫోటోల దగ్గర నుంచి తన సినిమా అప్ డేట్స్ వరకు ప్రతిదీ కూడా అనసూయ తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది.సోషల్ మీడియా మాధ్యమాలలో బిజీ ఉండే సెలెబ్రెటీలలో ఈమె కూడా ఒకరు అని చెప్పచ్చు.జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా పరిచయం అయినా అనసూయ బుల్లితెర మీద గ్లామర్ అద్దిన అతి కొద్దీ మంది యాంకర్లలో ఈమె కూడా ఒకరు.బుల్లితెర మీద యాంకర్ గా రాణిస్తూనే వెండి తెర మీద కూడా తన టాలెంట్ ను నిరూపించుకుంది అనసూయ.
Source link