Ali Basha : ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి నోరు విప్పిన ఆలీ.. ఏమన్నాడంటే..!


Ali Basha : ఆలీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న‌దైన కామెడీతో హాస్యం పండిస్తూ అందరిని అల‌రిస్తుంటారు. పూరీ జగన్నాధ్ సినిమాల్లో అలీ పాత్రలకు ఒక సెపరేట్ క్రేజ్ ఉంటుంది. సినిమా కథతో సంబంధం లేకుండా అలీ కోసం ప్రత్యేకంగా ఒక స్టోరీని రెడీ చేస్తారు పూరీ. అలా పూరీ డైరెక్ట్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లో అలీ గెటప్స్, కామెడీ ఎవర్‌గ్రీన్‌గా మిగిలిపోయాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’తో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యారు. డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న అలీ.. పూరీ జగన్నాధ్, రామ్‌పై ప్రశంసలు కురిపించారు.

‘నాకు హాలీవుడ్‌లో రాంబో తెలుసు. టాలీవుడ్‌లో మా రాపో తెలుసు. ఈ సినిమాలో తను పడిన కష్టం అంతాఇంతా కాదు. రామ్ నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. పూరీ జగన్నాధ్ డైలాగ్స్‌తో, మణిశర్మ మ్యూజిక్‌తో, రామ్ ఎనర్జీ, స్టెప్పులతో స్టెప్పా మార్ ఎలా ఉంటుందో మీరు టీజర్ చూశారు. పూరీ జగన్నాధ్‌కు ఇదొక అద్భుతమైన సినిమా కాబోతుంది. తను ఎక్కడా తగ్గడు. కరెక్ట్‌గా ఒక టాబ్లెట్ వేస్తాడు. ఈ 15 తారీఖుకు ఆ టాబ్లెట్ రెడీగా ఉంది. మీరంతా రెడీగా ఉండాలి’’ అని నమ్మకంగా చెప్పారు అలీ. పూరీ జగన్నాధ్ మొదటి సినిమా ‘బద్రి’ దగ్గర నుండి ఆయన తెరకెక్కించిన ప్రతీ సినిమాను గుర్తుచేసుకున్నారు అలీ. ‘‘కోవిడ్ సమయంలో అద్భుతమైన సినిమా చేయాలని లైగర్ ట్రై చేశారు. కానీ భగమంతుడు ఆ అవకాశం ఇవ్వలేదు. ప్రతీ ఒక్కరికి ఒక హిట్, ఫ్లాప్ ఉంటుంది.

Ali Basha first comments on pawan kalyan after his deputy cm ministry
Ali Basha

ఏ డైరెక్టర్, నిర్మాత అయినా ఫ్లాప్‌ను తీయాలని అనుకోరు. జనాల్ని మెప్పించాలి, హిట్ కొట్టాలి అనే ఉద్దేశ్యంతోనే సినిమాలు చేస్తారు’’ అంటూ ‘లైగర్’ ఫెయిల్యూర్‌పై స్పందించారు అలీ. థియేటర్లకు పట్టిన తుప్పును వదిలించడానికి ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తున్నాడని అన్నారు. హీరోయిన్ కావ్య థాపర్ డ్యాన్స్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. మూవీ టీమ్ అంతా సినిమా కోసం చాలా కష్టపడ్డారని తెలిపారు. ‘అమెజాన్ ఫారెస్ట్‌లో ఒక భాష ఉంటుంది. ఆ భాషను కనిపెట్టి నా క్యారెక్టర్‌ను క్రియేట్ చేశాడు పూరీ జగన్నాధ్. నాకోసం అలాంటి అద్భుతమైన క్యారెక్టర్‌ను సృష్టించినందుకు సంతోషంగా చేశాను. నా కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ముంబాయ్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా చల్లగా ఉంది’’ అంటూ తన స్టైల్‌లో ఈ క్యారెక్టర్ గురించి కామెడీగా వివరించారు అలీ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *