Dasara Movie : ద‌స‌రా చిత్రంలో నాని స్నేహితుడిగా న‌టించిన వ్య‌క్తి గురించి తెలుసా..?


Dasara Movie : నేచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా చిత్రం దసరా మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమా రిలీజ్ కి ముందు చిత్రబృందం సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువచేసే ప్రయత్నం చేసింది. ఇక చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషించారు. దసరా ప్రమోషన్లలో భాగంగా దీక్షిత్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. దీక్షిత్ నాని తెరకెక్కించిన మీట్ క్యూట్‌ వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు

దసరాలో కీలక పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసిన దీక్షిత్‌ శెట్టి దసరాలో నాని స్నేహితుడు సూరి పాత్రలో నటించి మెప్పించాడు. నాని కి ప్రాణ స్నేహితుడిగా క‌నిపించిన దీక్షిత్.. కథలో హీరో తో సమానమైన పాత్ర కావడం తో ప్రొమోషన్స్ లో నాని తో పాటుగా ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. టాలీవుడ్ ఆడియన్స్ కి ఇత‌ను పెద్ద‌గా తెలియ‌దు. కన్నడ లో టీవీ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించాడు. అంతే కాకుండా యూట్యూబ్ లో కన్నడ భాషలో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నెటిజెన్స్ కి కూడా ద‌గ్గ‌ర‌య్యాడు. చూసేందుకు ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఇతను ఈ సినిమా ద్వారా కచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో నాటుకుపోతాడు అని అంద‌రు భావిస్తున్నారు.

Dasara Movie do you know who acted as nani friend
Dasara Movie

దసరాలో ఫుల్ లెంగ్త్‌ రోల్‌ చేసే ఛాన్స్ కొట్టేసిన దీక్షిత్ ..ఈ పాన్ ఇండియా చిత్రంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నా. తెలంగాణ యాసలో డైలాగ్స్‌ చెప్పడం..నా పాత్ర కోసం భిన్నమైన బాడీ లాంగ్వేజీ బిల్డప్‌ చేసుకోవడం లాంటి చాలా విషయాలను నేర్చుకున్నాన‌ని చెప్పుకొచ్చాడు. నాని హీరో గా నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ కి పరిచయం కాగా, ఇప్పుడు అత‌ను పెద్ద స్టార్ అయ్యాడు. ఇప్పుడు దీక్షిత్ శెట్టి కూడా మంచి స్టార్ అవుతాడు అని అంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *