వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్…ఫొటోస్ వైరల్





Varun Tej, Lavanya Tripathi

Varun Tej, Lavanya Tripathi: ఈ ఏడాది జూన్ 9 న వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం అందరికి తెలిసిందే.కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్ధం మణికొండలో నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది.అయితే ఈ వేడుక ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.ఆ తర్వాత విదేశాలకు వెళ్లిన వీరిద్దరూ అక్కడే పెళ్లి షాపింగ్ చేసారు.లావణ్య కూడా పెళ్లి షాపింగ్ విదేశాలలో చేసింది.బ్యాచులర్ లైఫ్ ను కుటుంబం తో ఎంజాయ్ చేసాడు వరుణ్ తేజ్.

ఇక వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.అప్పట్లో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.నవంబర్ 1 ఇటలీ లో వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి పెళ్లి అంగరంగ వైభవం గా జరగనుంది.ఇప్పటికే పెళ్లి కు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు సమాచారం.వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కూడా కుటుంబ సభ్యల,సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరుగుతున్నాయి.

చిరంజీవి గారి ఇంట్లో మొన్ననే వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగిన సంగతి అందరికి తెలిసిందే.ఇక తాజాగా అల్లు అరవింద్ ఇంట్లో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సెలెబ్రేషన్స్ జరిగాయి.తమ స్నేహితులకు వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి అదే సమయంలో పార్టీ ఇవ్వడం జరిగింది.ఇక ఈ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అక్టోబర్ 30 వరకు జరగనున్నాయని తెలుస్తుంది.ఇక అల్లు అరవింద్ గారి ఇంట్లో జరిగిన వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఫొటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.








Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *