సమర సింహారెడ్డి సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ .. ఇప్పుడిలా మారిపోయిందేంటి..!


Samarasimha Reddy

Samarasimha Reddy: 1990లో చైల్డ్ ఆర్టిస్ట్‌లు చాలా మంది వెండితెరపై తమ ముద్దు ముద్దు మాటలు, చక్కని అభినయంతో ప్రేక్షకులను అలరించినవారున్నారు. హీరో, హీరోయిన్లకు తీసిపోని విధంగా డైలాగ్ డెలివరీతో చిచ్చర పిడులు అనిపించుకున్నవాళ్లూ ఉన్నారు. పై ఫొటోలో ఉన్న చిచ్చిర పిడిగు గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది. 1980-1990 మధ్య కాలంలో ఈ చిన్నారి చాలా సినిమాల్లో కనిపించింది.

స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ తదితర హీరోల సినిమాల్లో బాలనటిగా నటించి మెప్పించింది. ఒక్క టాలీవుడ్‌లోనే వంద వరకు సినిమాల్లో కనిపించింది. మేజర్ చంద్రకాంత్, హిట్లర్, రౌడీ అల్లుడు, సరమ సింహారెడ్డి వంటి సూపర్ హిట్ మూవీస్‌లో చక్కని అభినయంతో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. బిగ్ స్క్రీన్‌పై ఈ చిన్నారిని చూసిన ప్రేక్షకులు తమ పాపలాగే ఉంది, తమకు తెలిసిన వారి చిన్నారిలాగే ఉందంటూ మంత్రముగ్దులయ్యేవారు.

ఈ బేబీ ఎవరో ఇప్పటికైనా గుర్తొచ్చిందా? అదేనండీ సమర సింహారెడ్డిలో బాలకృష్ణ చెల్లెలుగా కనిపించింది. దివ్యాంగురాలిగా నటించిన చిన్నారి సెంటిమెంట్ సీన్‌లో తన నటన నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించిందనడంలో సందేహం లేదు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయే సీన్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. ఇప్పటికే ఆ చిన్నారి ఎవరో గుర్తొచ్చి ఉంటుంది.

అదేనండి ఆ పాపేరు శ్రేష్ఠ. సమర సింహారెడ్డి మూవీనే శ్రేష్ఠ లాస్ట్ సినిమా. ఆ తరువాత ఫిల్మ్ ఇండస్ర్టీకి దూరంగా ఉంది. చాలా ఏళ్ల తరువాత ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మెరిసింది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. ఆ చిన్నారే ఈ అమ్మాయి. సమర సింహారెడ్డి తరువాత స్టడీస్‌పై ద‌ృష్టిపెట్టానని, బీటెక్, ఎంటెక్ పూర్తి చేశానని, కొన్నాళ్లు అమెరికాలో జాబ్ చేశానని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కొద్ది నెలల క్రితమే ఇండియాకు తిరిగొచ్చానని, ప్రస్తుతం తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ కన్‌స్ర్టక్షన్ బిజినెస్ చూసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇంకా తన పర్సనల్ విశేషాలు చాలానే షేర్ చేసుకుంది. మంచు మనోజ్‌తో తనకు పెళ్లి చేయాలని అనుకున్నా కొన్ని రీజన్స్ కారణంగా రద్దయినట్లు చెప్పింది. ప్రస్తుతం తను ఒంటరిగానే ఉంటున్నట్లు తెలిపింది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *