విక్రమార్కుడు సీన్ ను విజయశాంతి ఆ సినిమా నుంచి కాపీ చేసారని తెలుసా….అసలు నిజం చెప్పిన విజయేంద్ర ప్రసాద్…


తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించి పెట్టిన దర్శకుడు రాజమౌళి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.బాహుబలి సినిమాతో ఆయన విజువల్ వండర్ క్రియేట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.రాజమౌళి మ్యాజిక్ కి అభిమానులు ఫిదా అయ్యారు.ఆయనకు ఎన్నో అవార్డులు మరియు రికార్డులు వరించాయి.ఇక ఆ తర్వాత వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా కూడా అదే రేంజ్ లో విజయం సాధించడం జరిగింది.వరుసగా అద్భుతమైన విజయాలతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.ఇక రాజమౌళి ఇంతటి భారీ విజయాల వెనుక కథలను అందించే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా భాగం ఉందని చెప్పచ్చు.

జక్కన్న రాజమౌళి సినిమాలు ప్రశంసలతో పాటు ట్రోల్స్ ను కూడా ఎదురుకోవడం జరుగుతుంది.హాలీవుడ్,కొరియన్ సినిమాలలోని సీన్లను రాజమౌళి కాపీ చేస్తారని విమర్శలు కూడా వస్తూ ఉంటాయి.కొన్ని పాత సినిమాల నుంచి కూడా ఆయన సీన్స్ కాపీ కొట్టి యధావిధిగా తెరకెక్కిస్తారని కూడా ఆరోపణలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.రాజమౌళి మరియు హీరో రవితేజ కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమా హిట్ అయినా సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో హీరో రవితేజ పోలీసోడె కాదు పోలీసోడి యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది అనే ఒక హైలెట్ సీన్ ఉంటుంది.

అయితే ఈ సీన్ ను గతంలో హీరోయిన్ విజయశాంతి నటించిన శాంభవి ఐపీఎస్ సినిమా నుంచి రాజమౌళి తెరకెక్కించారని…సీన్ ను అలాగే సేమ్ టు సేమ్ దించేశారని ఆయన మీద ట్రోల్ చేసారు నెటిజన్లు.ఆ సీన్ గురించి జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను ఒక ఇంటర్వ్యూ లో ఓ సీనియర్ జర్నలిస్ట్ డైరెక్ట్ గా అడగడం జరిగింది.విజయేంద్ర ప్రసాద్ దానికి సమాధాం చెప్తూ శాంభవి ఐపీఎస్ కథ కూడా తానె రాసినట్లు తెలపడం జరిగింది.అయితే ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో ప్రొడ్యూసర్ తో మాట్లాడి ఆ సీన్ ను విక్రమార్కుడు సినిమా కోసం వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు.రాజమౌళి కూడా గతంలో ఈ విషయం పై స్పందిస్తూ నేను ఇంతకుముందు ఇతర సినిమాలు మరియు నవలల నుంచి కాపీ చేశాను.విక్రమార్కుడు సినిమాలోని బులెట్ సీన్ మాత్రం కాపీ కాదు అది మా నాన్న చాల కాలం క్రితం రాసారు అని ట్వీట్ చేయడం జరిగింది.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *