అమిగోస్ టీజర్ … ఆసక్తికరంగా కళ్యాణ్ రామ్ మరో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్


Nandamuri Kalyan Ram Amigos Teaser | ఎప్పుడో 89 లోనే బాలయ్య బాలగోపాలుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆ తరువాత హీరో అయి కూడా రెండు దశాబ్దాలు కావొస్తుంది. కెరీర్ లో ఒకటి రెండు హిట్లు తప్పితే ఇప్పటికీ కళ్యాణ్ రామ్ నిలదొక్కుకోలేదనే చెప్పాలి. గతచిత్రం ‘ఎంత మంచివాడవురా’ భారీ డిజాస్టర్ అవటంతో కళ్యాణ్ రామ్ హోప్స్ అన్నీ ‘బింబిసార’ సినిమాపైనే పెట్టుకున్నాడు.

ఆగష్టు 5 న భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించటమే కాక కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రం ‘అమిగోస్’ ఫిబ్రవరి 10 న విడుదలకు సిద్ధమైంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ విడుదల చేసారు. బిమ్బిసార హిట్ తరువాత వస్తున్నా సినిమా కావటంతో సహజంగానే ఈ సినిమా పై నందమూరి అభిమానుల్లో ఎంతో ఆసక్తి ఉంది. పైగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించటం తో మరింత క్రేజ్ సంపాదించింది ‘అమిగోస్’.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ కథానాయిక. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా కథ మరియు దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి. ఈమధ్యే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఎన్టీఆర్ ‘జై లవకుశ’ పోలికలు కనిపిస్తున్నాయి. మీరూ ఓ లుక్కెయ్యండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *