Harsha Sai: ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ద్వారా ఎంతో మంది ఉపాధిని పొందుతున్న సంగతి తెలిసిందే.టాలెంట్ ఉన్నవారు తమ నైపుణ్యాలతో వీడియోలు చేసి యూట్యూబ్ లో రాణిస్తున్నారు.ఇలా తమ వీడియోలతో ఫేమస్ అయినా వాళ్ళు కూడా చాల మందే ఉన్నారు.ప్రస్తుతం ఇదే క్రమంలో హర్ష సాయి అనే యువకుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించటం జరిగింది.పేదవారిని గుర్తించి వారిని ఆదుకునే కార్యక్రమాలు చేస్తూ యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు.
సమాజ సేవ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును క్రేజ్ ను సంపాదించుకున్నాడు హర్ష సాయి.హర్ష సాయి కి యూట్యూబ్ లో 8 .64 మిలియన్ ఫాలోవర్స్,ఇంస్టాగ్రామ్ లో 4 మిలియన్ ఫాలోవర్స్,పేస్ బుక్ ఇతర సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో కలిపి పది మిలియన్స్ పైగానే ఫాలోవర్స్ ఉన్నారు.హర్ష సాయి చేస్తున్న సామజిక కార్యక్రమాలతో ఇతను సినిమాలలోకి వస్తాడని,లేక రాజకీయాలలోకి వస్తాడని ముందునుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే హర్ష సాయి తాజాగా ఒక సినిమా ద్వారా హీరో గా ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.బిగ్ బాస్ ఫెమ్ మిత్ర శర్మ తీస్తున్న కొత్త సినిమాలో హర్ష సాయి కూడా భాగం కాబోతున్నాడు అని తెలుస్తుంది.మిత్ర శర్మ నిర్మించబోయే ఈ సినిమాతో హర్ష సాయి హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.హర్ష హీరోగా నే కాకుండా దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
Source link