నంద‌మూరి ఫ్యామిలీకి శాపం ఉందా.. ఎందుకిలా ఆ ఫ్యామిలీలో వ‌రుస మ‌ర‌ణాలు..?


టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోని అతి పెద్ద ఫ్యామిలీలో నంద‌మూరి కుటుంబాన్ని ఒక‌టిగా చెప్ప‌వ‌చ్చు. నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట‌వార‌సులుగా ఇండ‌స్ట్రీకి చాలా మంది ఎంట్రీ ఇచ్చారు. అయితే ఎవ‌రికి వారు వారి టాలెంట్‌తో స‌త్తా చాటుతున్నారు. ఇటీవ‌లి కాలంలో నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటుండ‌డం అభిమానుల‌ని ఎంత‌గానో క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది.. ఒకరి తర్వాత మరొకరు అత్యంత పాశ‌వికంగా మ‌ర‌ణిస్తున్నారు. ముందుగా ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అనంత‌రం త్రివిక్రమరావు చిన్న కొడుకు హరిన్ చక్రవర్తి కూడా రోడ్ యాక్సిడెంట్ లోనే మృతి చెందాడు. నటుడిగా ఎదిగే టైంలో హరిన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇక హరిన్ సోదరుడు కల్యాణ్ చక్రవర్తి కొడుకు పృథ్వీ కూడా రోడ్ యాక్సిడెంట్ లో క‌న్నుమూసారు.

ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం నందమూరి హరికృష్ణ దారుణమైన స్థితిలో చనిపోవ‌డం మ‌నం చూశాం. 2018 ఆగస్టు 29న నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఓ వాహనాన్ని తప్పించే క్రమంలో ఆయన వాహనం డివైడర్‌ను ఢీకొట్టి, రోడ్డు అవతల వైపు ఎగిరిపడి బోల్తా కొట్ట‌డంతో డ్రైవింగ్ చేస్తోన్న హరికృష్ణ.. వాహనం నుంచి బయటకు ఎగిరి పడి త‌ల‌కు తీవ్ర‌గాయాలు అయి చ‌నిపోయాడు. ఇక హరికృష్ణ ప్రమాదానికి గురవ్వడానికి నాలుగేళ్ల కిందటే ఆయన పెద్ద కుమారుడు నందమూరి జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన కూడా నల్గొండ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో కన్నమూయడం యాదృశ్చికం. 2014 డిసెంబర్‌ 6 నల్గొండ జిల్లా కోదాడ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

nandamuri family why these sudden deaths

2022 ఆగస్టు 1న ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి హఠాన్మరణం చెందిన వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. అనారోగ్యంతో బాధపడిన ఉమామహేశ్వరి ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కారు ప్రమాదానికి గురయ్యారు. 2009 మార్చి 27న హైదరాబాద్ తిరిగి వస్తూ ఖమ్మంలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 10న ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్-10లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. నందమూరి రామకృష్ణ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక శ‌నివారం తార‌క‌ర‌త్న క‌న్నుమూసారు. అస‌లు వీళ్ల ఫ్యామిలీకి ఏమైందా అని అంద‌రు చర్చించుకుంటున్నారు.

The post నంద‌మూరి ఫ్యామిలీకి శాపం ఉందా.. ఎందుకిలా ఆ ఫ్యామిలీలో వ‌రుస మ‌ర‌ణాలు..? appeared first on Telugu News 365.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *