Varun Lavanya : టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్,హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.వీరిద్దరి పెళ్లి నవంబర్ 1 న ఇటలీ లోని టాస్కాని లో గ్రాండ్ గా జరిగింది.మెగా,అల్లు ఫ్యామిలీలు నాలుగు రోజుల ముందే ఇటలీ కి చేరుకొని పెళ్లి లో హాజరయ్యారు.పెళ్ళికి నాలుగు రోజుల ముందే షురూ అయినా వీరి పెళ్లి వేడుక ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ అయ్యాయి.
ఇక రెండు రోజల క్రితమే నూతన వధూవరులతో పాటు మెగా,అల్లు కుటుంబాలు హైదరాబాద్ కు చేరుకున్నారు.మెగా ఫ్యాన్స్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొత్త జంటపై పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు.నిన్న ఆదివారం వరుణ్,లావణ్య రిసెప్షన్ హైదరాబాద్ లోని యెన్ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది.
వీరిద్దరి రిసెప్షన్ కు ఇరువురు కుటుంబసభ్యులతో పాటు సినిమా,రాజకీయ ప్రముఖులు,మెగా అభిమాన సంఘాల నాయకులూ,మీడియా ప్రతినిధులు హాజరయ్యి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.వరుణ్,లావణ్య రిసెప్షన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో వైరల్ అవుతున్నాయి.
Source link