నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అఖండ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసారు.ఈ సినిమాలో బాలకృష్ణ తల్లిగా నటించిన నటి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
దాంతో అఖండ సినిమాలో బాలకృష్ణ తల్లిగా నటించింది ఎవరు అనే దాని మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.బాలయ్య తల్లిగా నటించిన నటి పేరు విజి చంద్రశేఖర్.ఈమె భర్త ఎయిర్ ఇండియా లో మోస్ట్ సీనియర్ రిటైర్డ్ కెప్టెన్.ఒక ఇంటర్వ్యూలో తన భర్త గురించి మాట్లాడుతూ విజి చంద్రశేఖర్ తాను ఎయిర్ ఇండియాలో రిటైర్డ్ అయినప్పటికీ ఇంకా అనులోనే పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
తానూ నెలలో పన్నెండు రోజులు మాత్రమే పనిచేస్తానని మిగిలిన సమయాన్ని తన ఫ్యామిలీకి కేటాయిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.తనకు ఉన్న ఇద్దరు కూతుర్లలో ఒకరు డాక్టర్ అని మరొకరు యాక్టర్ అని ఆమె తెలిపారు.ఇక తన భర్త కెప్టెన్ అవడంతో ఒక అతిథి లాగ ఇంటికి వచ్చి వెళ్లేవారని దాంతో ఇద్దరు కూతుర్ల పూర్తి భాద్యతలు తీసుకోవడం వలన తక్కువ సినిమాలలో నటించాల్సి వచ్చిందని ఆమె ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.చిన్నప్పుడు పిల్లల భాద్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే పెద్దయ్యాక బాధపడాల్సిన అవసరం రాదని అందుకే సినిమాలలో కంటే తన పిల్లలకే ఎక్కువ సమయం కేటాయిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
Source link