అంబర్ పేట వీధి కుక్కల ఘటనతో.. ర‌ష్మీ గౌత‌మ్‌పై విరుచుకుప‌డుతున్న నెటిజ‌న్స్..


బుల్లితెర యాంక‌ర్‌గా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మీ గౌత‌మ్ అప్పుడ‌ప్పుడు సినిమాల‌లో న‌టిస్తుంటుంది. అలానే జంతు ప్రేమికురాలైన ర‌ష్మీ ఎవరైనా మూగ జీవాలను హింసిస్తే కోపంతో రగిలిపోతుంటుంది. కరోనా సమయంలో మూగజీవాల ఆకలి తీర్చేందుకు తన వంతుగా సాయం చేసింది. అయితే మూగ జీవాల విష‌యంలో ర‌ష్మీ స్పందించే తీరుపై ఎప్పుడు ప్ర‌శంస‌లు ల‌భిస్తూ ఉంటాయి. కాని ఈ సారి మాత్రం ర‌ష్మీని ఏకి పారేస్తున్నారు. నీ వ‌ల్లే ఇలాంటి దారుణాలు జ‌రుగుతున్నాయి అంటూ తిట్టి పోస్తున్నారు. అస‌లు విష‌యంలోకి వెళితే అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన విష‌యం తెలిసిందే.

కుక్కల దాడిలో దారుణంగా గాయపడిన చిన్నారి ప్రదీప్.. ప్రాణాలు వదలడం అత్యంత విషాదకరం. ఈ ఘటనతో రాష్ట్రం ఒక్క‌సారిగా ఉలిక్కిపడింది. వీధి కుక్క‌ల దాడి ఘ‌టన‌పై మంత్రి కేటీఆర్, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు స్పందిస్తూ ఇది అత్యంత బాధాక‌ర‌మ‌ని అన్నారు.ఇక జంతుప్రేమికురాలైన ర‌ష్మీ కూడా స్పందిస్తూ.. జ‌రిగిన ఘ‌ట‌న‌లో బాలుడి తప్పేంలేదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన‌ ఉంది. కుక్కల సంతాన ఉత్పత్తి, వ్యాక్సినేషన్, వాటికి సరైన వసతి కల్పించాలి అంటూ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చింది.

netizen very angry on rashmi gautam for amberpet incident

ర‌ష్మీ ట్వీట్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. నీలాంటి వాళ్లు వీధి కుక్క‌ల‌ని ప్రోత్స‌హించ‌డం వ‌ల్ల‌నే ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి ఇలా క‌న్నుమూయ‌డం వారికి ఎంత క‌డుపుకోత‌ని మిగిలిస్తుంది. అది నువ్వు తీర్చ‌గ‌ల‌వా. మ‌ళ్లీ కుక్క‌ల‌కి వ్యాక్సినేషన్, సరైన వసతి క‌ల్పించాలి అంటూ క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెబుతున్నావ్ అంటూ ర‌ష్మీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే కుక్క‌ల వ‌ల‌న ఎంతో మంది చిన్నారులు క‌న్నుమూసారు. ఇప్పుడు మ‌న హైదరాబాద్‌లోనే ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దారుణం. దీనికి నువ్వు కూడా ప‌రోక్షంగా కారణ‌మ‌య్యావు అంటూ ర‌ష్మీ గౌత‌మ్‌ని తిట్టి పోస్తున్నారు. రష్మికి జంతువులన్నా.. పక్షులన్నా చాలా ఇష్టం. మూగజీవాలపై ప్రేమని చూపిస్తూ.. జంతు సంక్షేమం కోసం గళం వినిపిస్తూనే ఉంటుంది. కాని వీధి కుక్క‌ల విష‌యంలో ఆమె మాట్లాడుతున్న మాట‌లు ఎవ‌రికి న‌చ్చ‌డం లేదు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *